అరకులోయ గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు
(సిటీ ట్రెండ్ న్యూస్ అరకు)
అరకులోయ గిరిజన గ్రామాల్లోతాగునీటిసమస్యలు
ఒకవైపు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గిరిజనులు తాగునీటి సమస్యలతో కూడా కొట్టుమిట్టాడుతున్నారు.
అరకులోయ మండలం మాదల పంచాయతీ బోరిగుడ గ్రామంలో మంచినీటి ట్యాంకులు మరమ్మతులకు గురవడంతో రెండు వారాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 80 పీటీజీ కుటుంబాలు నివసిస్తున్నారు.
గ్రామంలో తాగునీటి మోటారు కాలిపోయి, చేతిబోరు కూడా పాడైపోవడంతో కిలోమీటరు దూరంలోని ఊటగడ్డలో నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు సమస్య పరిష్కారించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.