100శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించుటకు ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారికి వినతిపత్రం.గిరిజన సంఘం.
జీవో నెంబర్ 3 రద్దుతో ఏజెన్సీ ప్రాంతంలో100 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రాష్ట్ర నీలం సహాని గారికి వినతిపత్రాన్ని సమర్పించెమని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స తెలిపారు.
పాడేరు ఐటీడీఏ పిఓ గారి ద్వారా వినతిపత్రాన్ని సమర్పించెము. పిఓ గారు స్పందిస్తూ ప్రభుత్వం కు సిఫార్సు చేస్తామని అన్నారు.
సివిల్ అప్పీల్ నెంబర్:3609/2002, పై 20 సంవత్సరం నుండి విచారణ అనంతరం ఏప్రిల్ 22 న గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో 5వ షెడ్యూల్డ్ ఏరియా లో వున్న ప్రత్యేక హోదా ప్రశ్నర్ధకంగా మారిందని, ఆదివాసీల హక్కులకు తిలోదకాలు ఇచ్చాల ఉంది.
ఆదివాసీ ప్రజలు అభివృద్ధి, ప్రాంతాల్లో మౌలిక వసతులు లేనందున నాటి ప్రభుత్వం బ్యాక్ డ్రాప్ ప్రాజెక్టు పేరుతో 1986 లో జీవో నెంబర్ 275 ను జారీచేసింది. నాడు గిరిజన అక్షరాస్యత కేవలం 17 శాతం మాత్రమే నాని, 10 వేల గ్రామాలకు పాఠశాల కూడ లేదు. మైదాన ప్రాంతం నుండి వలస వచ్చిన ఉపాద్యాయులు స్థానికంగా నివాసం ఉండలేరని, మాత్రో భాష విద్య బోధన సాధ్యం కాదని నాటి ప్రభుత్వం స్థానిక గిరిజనుల కు 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గవర్నర్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 100 శాతం రిజర్వేషన్ పై కొందరు వ్యతిరేకంగా హై కోర్టుకు కేసు వేయగా 100 శాతం రిజర్వేషన్ ను నాటి హై కోర్టు సమర్ధించింది. అనంతరం జీవో ఎం. ఎస్ నెంబర్ 3 ను 2000 సంవత్సరం లో ప్రభుత్వం అమలులో కి తెచ్చింది. నాటి నుండి నేటి వరకు సుమారు 25 వేల ఆదివాసీల కుటుంబాలు ప్రయోజనం పొందేరు. నేటికి పాఠశాలలు లేని గ్రామాలు ఉన్నాయి..
ఆంద్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగం లో స్థానిక గిరిజనుల కు 100% రిజర్వేషన్ కల్పిస్తూన జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన నష్టం వాటిల్లింతుంది.
👉ఈ తీర్పు అమలైతే విద్య శాకే కాకుండా 19 శాఖలలో సుమారు 35 రకరకాల ఉద్యోగలు కు స్థానిక గిరిజనులు కోల్పోతారు. నిరుద్యోగుల పెరుగుతారాని గిరిజన ప్రాంతంలో ఆసాంగీక కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందాని, 5వ షెడ్యూల్డ్ ఏరియా రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు లో గిరిజన లకు అనుకూల వాదన వినిపించడం లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైంది.
👉విద్య,వైద్య,రాజకీయ, మరియు భూమి పై ఆదివాసుల కు రాజ్యాంగం ద్వారా హక్కులు ప్రత్యేకించబడ్డాయి. షెడ్యూల్డ్ ఏరియా లో ఆదివాసీల రిజర్వేషన్ లో రాజకీయ రిజర్వేషన్ వల్ల సామాజిక వివక్షత కు గురి కబుడుతున్న ఆదివాసులకు చట్ట సభల్లో కూడ ప్రాతినిధ్యం కోల్పోతారు.
👉 ఆదివాసీ రిజర్వేషన్ రక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విచారణ పేరిట జాప్యం జరిగే అవకాశం ఉంది. వినతిపత్రం లో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(AARM)జాతీయ చైర్మన్,మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, భద్రాచలం మాజీ శాసన సభ్యులు సున్నం రాజ్యయా, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాద్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శెట్టి పూర్ణ చంద్రరావు,గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కుడుముల కాంతారావు, మాజీ కో,, కన్వీనర్ కూడ కోటి జయ ప్రసాద్, గిరిజన ఉపాద్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిలకంఠం, గిరిజన వైద్య,ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శెట్టి నాగరాజు, యూటీఫ్ డివిజన్ కన్వీనర్ చీకటి నాగేశ్వరరావు, కెవి రమణ,మోద అప్పారావు తదితరులు సంతకాలతో సమర్పించెము. అని తెలిపారు.