రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చెయ్యాలని
కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 న రిలే నిరాహారదీక్ష ను జయప్రదం చేయండి.
-గిరిజన సంఘం.
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
జీవో నెంబర్ 3 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. గిరిజన సంఘం హర్షం వక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు అమల్లో వచ్చింది.100 ఉద్యోగ రిజర్వేషన్ ప్రశ్నర్ధకంగా మారింది.కావున 100శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మే 13 నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష దీక్ష ను జయప్రదం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చారు.
రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి వినతిపత్రాన్ని గిరిజన సంఘం సమర్పించింది. గిరిజనులకు ఆసరాగా నిలవండి అని ప్రకటన చేశారు.సానుభూతి తో సమస్యలు పరిష్కారం కాదు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను తొలగించడాని, గ్రామ సచివాలయంలో రంగులు మార్పులు రాష్ట్ర హైకోర్టు స్పందనకు ప్రతి స్పందనగా ఆగమేఘాల పై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కానీ జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే కనీస స్పందన కూడ లేకపోవడంతో గిరిజన ఉద్యోగులు, ఉపాద్యాయులు,నిరుద్యోగుల తీవ్ర ఆందోళనలకు కాబడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం, లేదా థర్డ్ పార్టీ వారు దాఖలు చేసే పిటిషన్ పై విచారణ పేరిట సుప్రీం కోర్టులో జాప్యం జరుగుతాయి. అప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించే విద్య,ఉద్యోగ, రాజకీయ నోటిఫికేషన్ జారీ చేస్తే లక్షలాది మంది గిరిజనుల కు తీవ్రంగా నష్టం పోతారని గిరిజన సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.సుప్రీంకోర్టు లో గిరిజనులకు అనుకూలంగా వాదనలు వినిపించడం లో ప్రభుత్వం వైఫల్యం. జీవో నెంబర్3 ను కోర్టు కొట్టేసింది.
రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం గత వాదనలకు భిన్నంగా ప్రత్యామ్నాయ వాదనలకు కసరత్తు చెయ్యాలి. విద్య,వైద్య,రాజకీయ, మరియు భూమి పై ఆదివాసుల కు రాజ్యాంగం ద్వారా హక్కులు సంక్ర మించింది. ప్రభుత్వ ప్రకటన పై,కోర్టు వ్యవహారాలు పై గిరిజన మేధావులు, విద్యావంతులు నిశితంగా పరిశీలించాలి. పిటిషన్ దాఖలు చేసే ముందు న్యాయ నిపుణులు, మాజీ అధికారులతో వర్క్,షాప్ నిర్వహించాలి.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలి (టీఎసి) ని వెంటనే సమావేశ పర్చి , జీవో నెం 3 రద్దు పై చర్చిలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ తీర్పు అమలైతే విద్య శాకే కాకుండా 19 శాఖలలో సుమారు 35 రకరకాల ఉద్యోగలు కు స్థానిక గిరిజనులు కోల్పోతారు.100 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ జారీ కి గిరిజన ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.రాష్ట్ర గవర్నర్ గారికి సలహా ఇవ్వాలని కోరుతున్నాము.
పి.అప్పలనర్స.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
జిల్లా అధ్యక్షుడు
పి.లక్కు,
కొమ్మ పృద్వి రాజు.
జిల్లా ప్రధాన కార్యదర్శి