2500 కుటుంబాలకుహెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సహయం

లాక్ డౌన్ కారణంగా లక్షల మంది మధ్య పేద తరగతి ప్రజలకు జీవనోపాధి కష్టంగా మారిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో *"హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్"* సంస్థ పలు పట్టణాల్లో పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు. ఈ సంస్థ 2500 కుటుంబాలకు అందజేశారు.


(సిటీ ట్రెండ్ న్యూస్ - విశాఖపట్నం) reporter: B.SANTOSH KUMAR 



వైజాగ్ లో ఈ సంస్థ ఇప్పటిదాకా పలు కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా ఇటీవల కంచరపాలం దగ్గరలో నివాసముంటున్న పేద ప్రజలకు 100 నిత్యావసర కిట్లు అందించారు. అలానే ఇప్పటిదాకా 18 వందల మందికి రోజు భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు  ఇందు, అబ్దుల్  మన్నన్, దావూద్ ఇతర వాలంటీర్లు పాల్గొన్నారు.ఈ సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడిన *C. ఆకాష్* గారికి అలానే దాతలకు తమ కృతజ్ఞతలు తెలిపారు.