జి.ఓ. నo 3ను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

 


జి.ఓ. నo 3ను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి


(సిటీట్రెండ్ న్యూస్ - మన పాడేరు)



ఆదివాసీ విద్యార్ధి సంఘం సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మినుములూరు గ్రామంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో అంబేద్కరీయులు ఆదివాసీలకు మద్దతు నివ్వాలని,జి.ఓ.నo 3 ను కాపాడేందుకు ప్రత్యేక చట్టం స్థానిక ప్రభుత్వాలు తేవాలని అంబెడ్కర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డా,,ఎల్.మధు కుమార్ మాట్లాడుతూ ఈ సృష్టి నుంచి మొదలు నేటి వరకు దట్టమైన అడవులలో,కొండలలో దుర్భరమైన జీవనమును గడిపే ఆడివాసులమైన మాకు డా,,అంబేద్కర్ గారు దీర్ఘ దృష్టితో రాజ్యాంగములో 5వ షెడ్యూల్ ను కల్పిస్తే, డా,,అంబేద్కర్ గారు నిరంకుశంగా,స్వార్థ పూరితంగా, ఏక పక్షంగా,ఆదివాసీల పక్షాన రాసారని,గౌరవ సుప్రీం కోర్టు5గురు జడ్జీలతో కుడిన ధర్మాసనమును సమర్దించి జి.ఓ నo.3ను రద్దుచేసి డా,,అంబెడ్కర్ లాంటి సామాజిక తత్వవేత్తను అవమాన పరచడమే గాక ఆదివాసీల జీవనమే ఛిద్రం అయిన క్రమంలో డా,,అంబేద్కర్ అడుగు జాడను మరొక్కసారి గుర్తుచేసుకుంటున్నాము.ఈ దేశానికి ఆర్యుల వలసలను ఎదురొడ్డి పోరాడిన దశనుండి, చివరగా వలస వచ్చిన బ్రిటిష్ పాలన,నిజాం పాలనవరకు ఆదివాసీల రక్తపు మరకల దిక్షుచిగా 5వ షెడ్యూల్ ను డా,,అంబేడ్కర్ గారు రాసారని,ఈ దేశంలో ఆదివాసీల త్యాగాల చరిత్రను మరచి తీర్పునిచ్చిన క్రమంలో రాజ్యాంగ హక్కుల రక్షణకు వినతి చేయడం జరిగింది. ఈ దేశంలో అంబేద్కర్ తత్వం బ్రతికే ఉంది,అంబేద్కరీయులు ఆదివాసీలకు మద్దతుగా నిలవాలని,ఆదివాసులని రక్షించడానికితోడ్పడాలని అంబేద్కర్ గారికి విన్నవించడం జరిగింది..అలాగే గౌరవ సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించి షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగాలు ఆదివాసీ యువతకు దక్కే విదంగా స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని  విన్నవించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గంగాధర్,శివ,జగదీష్, నాగరాజు,రాంబాబు తదితరులు పాల్గొన్నారు


ఇట్లు
డా,,లంకెల మధకుమార్
రాష్ట్ర  అధ్యక్షులు
ఆదివాసీ విద్యార్థి సంఘం
ఆంద్రప్రదేశ్
9492431067