ఎల్‌.జి.పాలిమర్స్‌లో విషవాయువు లీక్ ఎల్జి పాలిమర్స్ పై కథనం ఎల్జి పాలిమర్స్ 1997 లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది,

ఎల్‌.జి.పాలిమర్స్‌లో విషవాయువు లీక్ 


(సిటీ ట్రెండ్ న్యూస్ - విశాఖపట్నం )


విశాఖలో భారీ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఉన్న ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. ఈ గ్యాస్ లీక్ కావడం.. అది బాగా ఘాటుగా ఉండటంతో.. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్వస్థతకు గురైన వందలాదిమందిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే గణబాబు, కలెక్టర్ చేరుకున్నారు.



గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. ఇటు సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. ఆ పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నారు. మేఘాద్రి గడ్డవైపు వెళుతున్నారు. అయితే గ్యాస్ దెబ్బకు అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే పరిశ్రమ నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకైందని.. వారు సరైన చర్యలు తీసుకోలేదని.. చాలాసార్లు పరిశ్రమ సిబ్బందిని హెచ్చరించామంటున్నా  స్తానీకులు.

 

 

ఎల్జి పాలిమర్స్పై కథనం

 

ఎల్జి పాలిమర్స్ పై కథనం
- ఎల్జి పాలిమర్స్ 1997 లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది, 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో ఈ సంస్థ ప్రారంభమైంది, ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల polystyrene  ను ఉత్పత్తి చేస్తుంది, దీన్ని styrene అనబడే  ముడిసరుకు ద్వారా ఉత్పత్తి చేస్తారు, ప్రస్తుతం styrene  గ్యాస్ లీక్ అయింది, ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు, వస్తాయి, ఇదే గ్యాస్ ను ఎక్కువగా పిలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంది, గతంలో కూడా ఈ ఎల్ జి పాలిమర్స్ కంపెనీ నుంచి  గ్యాస్ లీక్ వచ్చినప్పటికీ  కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై వాటిని అరికట్టే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం, ఈ కంపెనీ డైరెక్టర్ గా పిపి రామచంద్ర మోహన్ ఫోన్ నెంబర్ 9100040246 గా సమాచారం