27లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ తెలిపారు.

 


కరోనా వ్యాప్తి నివారణ అంశంతో పాటు మిగతా అంశాలపై కూడా దృష్టి పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...



పేదలకు ఇళ్ల పట్టాల పంపినీ అంశంపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా పెండింగ్‌లో పడిన ఈ కార్యక్రమాన్ని జూలై 8న నిర్వహించాలని కొద్దిరోజుల క్రితం నిర్ణయించిన సీఎం జగన్... ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లపట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు తనకు వచ్చాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి... మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని సూచించారు.


తాను గ్రామాల్లోకి వెళ్లి ఎవరికైనా ఇల్లు పట్టా లేదా అని అడిగితే ఎవరి నుంచి లేదు అనే సమాధానం రావొద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. తనకు ఓటు వేయని వారైనా పర్వాలేదని... వాళ్లకీ కూడా పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అర్హత ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంటిపట్టా లేదని చెప్పకూడదని అన్నారు. రాష్ట్రంలో 27లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ తెలిపారు.