జీవో నెం.3 రద్దును వ్యతిరేకంగా గిరిజన సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది.


 జీవో నెం.3 రద్దును వ్యతిరేకంగా గిరిజన సంఘం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తోంది.



(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)జీవో నెంబర్ 3 రద్దు ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ప్రకటించారు.
    మర్రి కమయ్య వర్ధంతి సభను గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కుడుముల కాంతారావు అధ్యక్షత న ఘనంగా నిర్వహించెము.
       ముందుగా మర్రి కమయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి సభ లో పాల్గొన్న నాయకులు, ప్రజలు నివాళులర్పించారు.3 నిమిషాల పాటు మౌనం వహించారు.
  అనంతరం గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పలనర్స  మాట్లాడుతూ జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు కోర్టు రద్దు చేసి నేటికి 13 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం నేటికి రివ్యూ పిటిషన్ దాఖలు పై ప్రకటన విడుదల చేయకపోవడం తో గిరిజన, ఉద్యోగులు, ఉపాద్యాయులు నిరుద్యోగులకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 రద్దును వ్యతిరేకిస్తూ, గిరిజనులకు అనుకూలంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. న్యాయ నిపుణులు లతో  చర్చ పక్రియ ప్రారంభించారు. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎటువంటి చర్యలు తీసుకోకపోతే గిరిజనుల అన్యాయం కు గురిఅవుతున్నారాని అన్నారు. 
       గిరిజనుల కు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన జీవో నెంబర్ 3 తో పొందుతున్న 100 శాతం రిజర్వేషన్ పరిరక్షణకు గిరిజన ఉద్యోగ,ఉపాద్యాయు,నిరుద్యోగుల తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ప్రకటించారు. రివ్యూ పిటిషన్ దాఖలు పై రాష్ట్ర ప్రభుత్వం జాప్యం పై గిరిజన ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని కోరారు.మర్రి కమయ్య పోరాట స్పూర్తితో ఉద్యమిద్దాం మని పిలుపునిచ్చారు.


      స్వతంత్ర సమరయోధులు మర్రి కమయ్య పోరాట చరిత్ర ను పాఠ్యపుస్తకాల ద్వారా భావితరాలకు అందించాలని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాద్యాయుల సంఘం అధ్యక్షుడు శెట్టి పూర్ణచంద్రరావు ప్రభుత్వం ను కోరారు. బ్రిటిష్ పాలకుల నిర్బంధం లో ఉన్న ఆదివాసీ ప్రాంతంలో అరచకత్వం పై పోరాటం నిర్వహించడంతో దిగివచ్చిన బ్రిటిష్ పాలకులు షెడ్యూల్డ్ ఏరియా కు స్వయం ప్రతిప్తతిని కల్పిస్తూ 1917,1930 లొనే  షెడ్యూల్డ్ ఏరియా చట్టం ను బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించారని,నేడు షెడ్యూల్డ్ ఏరియా స్ఫూర్తి కి తిలోదకాలు ఇచ్చేలా పాలకులు వ్యహరిస్తున్నారని అన్నారు. 5వ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల రక్షణ ప్రశ్నర్ధకంగా మారింది.
 ఈ కార్యక్రమంలో యూటీఫ్ డివిజన్ కన్వీనర్ చీకటి నాగేశ్వరరావు, గిరిజన ఉపాద్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. నిలకంఠం, గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కె.భాస్కరావు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ సహాయ కార్యదర్శి చిన్నయ్య, ఆదర్శ ఉపాద్యాయు అవార్డు గ్రహీత కెవి రమణ,పి.ఆర్.టీ.యూ మండల అధ్యక్షుడు కె.మోహన్ రావు,మత్యలింగం, సి.ఆర్. టి.యు నాయకులు తుడుం నూకరాజు,గిరిజన సంఘం మండల నాయకులు మోద శ్రీను,వి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.