3కిలోమీటర్లు కాలినడకన వెళ్లి  సందర్శించిన   పాడేరుఎమ్మెల్యేకొట్టగుళ్లిభాగ్యలక్ష్మి    డాక్టర్.నరసింగరావు 

ఈ రోజు 
పాడేరు నియోజకవర్గం కేంద్రం దగ్గరలో 
ఉన్న మోదపల్లి పంచాయతీ, గాలిపాడు గ్రామానికి సుమారు 3కిలోమీటర్లు కాలినడకన వెళ్లి  సందర్శించిన 
 పాడేరుఎమ్మెల్యేకొట్టగుళ్లిభాగ్యలక్ష్మి    డాక్టర్.నరసింగరావు  (ఆంధ్ర రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్)


(సిటీ ట్రెండ్ న్యూస్ - మనపాడేరు)


గాలిపాడు గ్రామం నియోజకవర్గకేంద్రంకు దగ్గర్లో 25కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే వెళ్లిన సందర్బంలేదు. 
రోడ్డు సదుపాయం లేదు. గ్రామంలో సుమారు 40కుటుంబలు నివసిస్తున్నయి. 
covid-19 కరోనా వల్ల లాక్-డౌన్ ఉండడం వలన ప్రజలు నిత్య అవసరం కొరకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు అవసర సరుకులు పట్టుకొని కాలినడకన వెళ్లి మారుమూల గ్రామం గిరిజనులకు తమతండ్రి గారి పేరు మీదున్న ట్రస్ట్ *కొట్టగుళ్లిచిట్టినాయుడుచారిటబుల్ ట్రస్ట్* ద్వారా నిత్య అవసర సరుకులు  అందించి ఎమ్మెల్యే దంపతులు  మానవత్వంను చాటు కున్నారు. 
కరోనా మహమ్మారి వ్యాధి పై అవగాహనా కల్పించారు. ఇంట్లోనే ఉండి.. పరిశుభ్రత పాటించాలని కోరారు. 
  ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కన్నాపాత్రుడు, సత్యనారాయణపాత్రుడు, కృష్ణారావు, రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.