కొయ్యూరు మండలం లోని మంప గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి 96 వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల. గాంధి.

మంపలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన లోకుల. గాంధీ ..



(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు)


కొయ్యూరు మండలం లోని మంప గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి 96 వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల. గాంధి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్సీ pvn మాధవ్ కృషివల్ల రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు ఆధ్వర్యంలో కొయ్యురు మంప లో ఉన్న అల్లూరి సీతారామరాజు కళా మందిరం పార్కు మొదలగు విషయాలపై అభివృద్ధి చేయుటకు కోటి రూపాయలు విడుదల చేయడం జరిగిందని ఆయన చెప్పారు అల్లూరి సేవలు మరువలేనివి అని మహానుభావుడు 27 సంవత్సరాలు బతికిన సరే చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర సృష్టించాడని అల్లూరి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు పని చేయాలి
అని చెప్పారు.


తదుపరి జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్ అల్లూరి సీతారామరాజు అనే నినాదాలతోబిజెపి కార్యకర్తలు అభిమానులు తో   వెళ్ళువెలిశాయి. ఈ కార్యక్రమాల్లో బిజెపి అరకు జిల్లా అధ్యక్షుడు కురుస ఉమామహేశ్వరరావు బిజెపి ఎస్టి మోర్చా సెక్రటరీ కూడా కృష్ణారావు బిజెపి రాష్ట్ర ఎస్టి మోర్చా ఉపాధ్యక్షుడు కురుస రాజారావు మరియు మండల బిజెపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.