ఎల్జీపాలిమర్స్  గ్యాస్ లీకేజీ     ఘటన చాలాబాధాకరం-అరకుఎంపీ గొడ్డేటిమాధవి


 ఎల్జీపాలిమర్స్  గ్యాస్ లీకేజీ     ఘటన చాలాబాధాకరం-అరకుఎంపీ గొడ్డేటిమాధవి


(సిటీ ట్రెండ్ వార పత్రిక - మన పాడేరు)



  బాధిత కుటుంబాలకు  అండగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
  విశాఖపట్నం లోని గోపాలపట్నం ప్రాంతంలో పాలిమర్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటన అత్యంత బాధాకరమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఆవేదన వ్యక్తం చేశారు .గురువారం విలేకరులతో మాట్లాడుతూ  తెల్లవారుజాము సమయంలో గ్యాస్ లీకేజ్ అయి విషవాయువు ప్రభావంతో ప్రజలంతా తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాటు  మరణాలు కూడా సంభవించిన ఘటన అందరినీ ఆందోళనకు గురి చేసిందన్నారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బాధితులను ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు కల్పించారని వారు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి  ఉదయం నుంచే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఈ ఘటనలో బాధితులకు అండగా నిలిచేందుకు పుట్టిన విశాఖ చేరుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే విధంగా సీఎం ప్రకటించారని దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి  బాధితులకు అండగా నిలిచి   సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన మానవత్వాన్ని చాటుకున్నారని  ఎంపీ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పెద్ద మొత్తంలో పరిహారం ప్రకటించడంతో పాటు ఎల్జి పాలిమర్ కంపెనీ ప్రాంతంలోని నిర్వాసిత కుటుంబాలకు కూడా  ఆర్థిక సహాయం అందచేయవలసిందిగా  జిల్లా యంత్రాంగానికి సీఎం గారు  ఆదేశించారని ఎంపీ తెలిపారు.
   ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు  ఎంపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.