ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అన్ని జిల్లాలో కూడా కరోనా వ్యాపించింది. తాజాగా విజయనగరం జిల్లాలో కూడా
కరోనాకేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ తొలి కరోనా మరణం నమోదైంది. బలిజిపేట మండలం చిలకపల్లికి చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లిన వృద్ధురాలికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.