గౌ,,శ్రీ పి.శ్రీధర్ .ఎం.డి.-జెన్కో విద్యుత్ సౌధ,విజయవాడ. వినతిపత్రం. అందజేసిన గిరిజన సంఘం.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ.
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
విషయం: సీలేరు జెన్కో లో స్థానిక గిరిజనులనే ఉద్యోగం లో నియమించాలని కోరుతూ..
ఆంధ్ర,ఒడిశా రాష్ట్ర ల సరిహద్దు ప్రాంతాల్లో ఏ పి. జెన్క్ పవర్ ప్లాంట్ విశాఖలో జిల్లా, జి.కె.వీధి మండలం, సీలేరు గ్రామంలో 1984 లో ఏర్పాటు చేశారు. జెన్.కో పవర్ ఉత్పత్తి చేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల స్థానిక గిరిజనులు తమ గ్రామాలను కాళీచేసి నిర్వాసితులగా మారిపోయారు.
జెన్.కో పవర్ ప్లాంట్ ఏర్పాటు కు నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను జెన్.కో యాజమాన్యం తుంగలో తొక్కి స్థానిక గిరిజనుల కు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. ఉద్యోగ నియామకాలలో కనీసం రూల్ అప్ రిజర్వేషన్ అమలు చేయడం లేదు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్( సి. ఎస్.ఆర్) ద్వారా జెన్.కో ఏర్పాటు చేసినా పాఠశాల ను దయానిధి ఆంగ్లో వేదిక (డి.ఏ.వి) వారితో 50 సంవత్సరం పాటు అక్రమ ఒప్పందం చేసుకొన్నారు. డి.ఏ.వి పాఠశాల లో 28 మంది సిబ్బంది, జెన్.కో ఆసుపత్రిలో35 విధులు నిర్వహిస్తున్న ఒక్క గిరిజనుడు ని కూడ నేటికి నియమించలేదు.
పాఠశాల నిర్వాహకులు డి,ఏ, వి వారికి మరియు ఆసుపత్రి నిర్వహణ పేరిట అక్రమ ఒప్పందం చేసుకున్న భవ్య హెల్త్ సర్వీస్ వారికి సి.ఎస్.ఆర్ పథకం ద్వారా ఒక్క సంవత్సరం నికి సుమారు 80 లక్షలు చెల్లిస్తున్నారు.కానీ స్థానిక గిరిజన యువత కు విద్య,ఉద్యోగ ప్రయోజనం అందడం లేదు. అక్రమ ఒప్పందం ను రద్దు చేయాలని కోరుతున్నాను.
డ్రవర్, స్లీపర్,ఎల్పర్, వంటి పోస్టులకు కూడ స్థానిక గిరిజనులతో నియమించకపోవడం తో జెన్.కో యాజమాన్యం ఉదేశ్యపూర్వకంగా గిరిజనులను విస్మరిస్తుంది. జెన్.కో లో అన్నిరకాల ఉద్యోగుల కు అర్హులైన స్థానిక గిరిజన నిరుద్యోగులు ఉన్నారు.ఉద్యోగ నియామకాలకు కనీసం నోటిఫికేషన్ విడుదల చేయకుండా జెన్.కో యాజమాన్యం తో జెన్.కో ఉద్యోగులు కుమ్మక్కై స్థానిక గిరిజనుకు అన్యాయం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జెన్.కో. ఆసుపత్రిలో4 డ్రవర్ పోస్టులకు అర్హులైన స్థానిక గిరిజనులు చిట్టపుల్లి కృష్ణ, పి.రాజేంద్రప్రసాద్, కొర్ర విశ్వరావు లు చేసుకున్న దరఖాస్తులను ధిక్కరించి, ఎటువంటి నోటిఫికేషన్ లేకుండ అక్రమ మార్గంలో గిరిజనేతరులైన్ మారిబాబు, రూబెన్ ను నియమించారు. ఇది చట్టవ్యతిరేకమైన చర్యగా బావిస్తున్నాము. సమగ్రమైన విచారణ నిర్వహించి బాద్యుల పై చర్యలు తీసుకోవాలి.
5వ షెడ్యూల్డ్ ఏరియా ప్రవేటు కార్పొరేషన్, సంస్థ,వ్యక్తులు భూ యాజమాన్యం పొందడం రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం. గిరిజన హక్కులు, చట్టాలను విస్మరించవద్దని,
పవర్ ప్లాంట్ వల్ల సర్వం కోల్పోయిన గిరిజనుకు న్యాయం చేయడానికి తమరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను.
డిమాండ్.
1).1/70కు విరుద్ధంగా డి.ఏ.వి మరియు భవ్య హెల్త్ సర్వీస్ వారితో జెన్.కో.చేస్తున్న అక్రమ ఒప్పందం రద్దు చెయ్యాలి.
2).ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులతోనే నియమించాలి.
3). ఉద్యోగ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చెయ్యాలి.
4).సి.ఎస్.ఆర్ పథకం ద్వారా స్థానిక గ్రామ పంచాయతీ లకు మౌలిక సదుపాయాల కల్పన కు నిధులు కేటాయించాలి.
5). ఉద్యోగ నియమాల పై సమగ్ర విచారణ నిర్వహించాలి.
6).అక్రమ నియమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలి.బాద్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.