శరభన్నపాలెం వైయస్సార్ బీమాను లబ్ధిదారులకు అందిస్తున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
ప్రమాదవశాత్తు గతంలో మరణించిన కొయ్యూరు మండలం చెందిన ముగ్గురు వ్యక్తుల మూడు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా క్లైమ్ ను ఈరోజు ఎంపీ స్వగ్రామమైన శరభన్నపాలెం నందు కుటుంబానికి వైయస్సార్ బీమా లక్ష రూపాయల చెక్కు లబ్ధిదారులకు అందజేశారు . లబ్ధిదారుల వివరాలు1. బాచల్ సంకురమయ్య - అంతాడ గ్రామం,2. బొల్ల సత్యనారయణ- రాజేంద్రపాలెం గ్రామం,3. పాంగి. బుజ్జిబాబు - తులబడ గ్రామం. ప్రస్తుతం ఈ పథకం క్రింద ఒక్కొక కుటుంబానికి ఐదు లక్షలు క్లైమ్ వస్తుందని ఎంపీ తెలిపారు . ఇందుకు గాను లక్ష రూపాయల చెక్కు ఈరోజు అందజేశారు మరో నాలుగు లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి ఈ నెలాఖరులో పడతాయని తెలిపారు. కావున ఈ డబ్బులు వృధా చేయకుండా జాగ్రత్తగా కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు మరియు వారి అభివృద్ధికి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని ఎంపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఏపీఎం అధికారి జే. ఈశ్వరరావు పాల్గొన్నారు.