విశాఖ ఏజెన్సీ:- విశాఖ మన్యంలో విజృంభిస్తున్న విషజ్వరాలు..
ప్రభుత్వ వైద్యం అందక మృతి చెందుతున్న గిరిజన ప్రజలు ..
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
ఆరోగ్య సిబ్బంది సక్రమంగా పని చేయటం లేదని గ్రామ ప్రజల ఆవేదన..
మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని డివిజన్ స్థాయి జిల్లా స్థాయి అధికారులు..
వివరాలు:- కొయ్యూరు మండలం లోని యూజీడీ పాలెం పంచాయితీ పీహెచ్సీ పరిధిలోగల వేమన పాలెం లో రమేష్ అనే వ్యక్తి తో పాటు ఇద్దరు కవల పిల్లలు మృతి చెందిన ఘటన మరవకముందే పాలసముద్రాన్ని కి చెందిన భీమరాజు అనే యువకుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మృతిచెందాడు.
డొని మోతతో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి నిన్న మరణించాడు .గ్రామానికి రహదారుల సౌకర్యం లేకపోవడం వాహనాలు
సౌకర్యం లేక అదే డోలి మోతతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.
విషయం తెలుసుకున్న అధికారులు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు హుటాహుటిన జిల్లా మలేరియా అధికారి వాణి మరియు పాడేరు ఎడిషనల్ ఏ డి ఎం హెచ్ ఓ యూచిడీ పాలెం పంచాయితీ లో పలు గ్రామాలకు సందర్శించడం జరిగింది
అప్పటికి కూడా ప్రజలకు మలేరియా కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి . కానీ అధికారుల రాతల్లో మాత్రం మలేరియా కేసులు లేవని చూపిస్తున్నారు.
ఈ చనిపోయిన వ్యక్తులకు ఒకరికి నలుగురు మరొకరికి ఆరుగురు పసి పిల్లలు ఉన్నారు.
కుటుంబాన్ని పోషించే యజమాని కోల్పోవడం వల్ల మేము ఏ విధంగా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
ప్రభుత్వం వారు ఇచ్చిన జీతాలు వేలకు వేలు తీసుకుంటూ ఉద్యోగరీత్యా కనీస బాధ్యత తీసుకోవటం లేదని అలాంటి వారికి పై అధికారులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు