రెడ్ జోన్ ఏరియా లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కెకె రాజు పర్యటన
(సిటీ ట్రెండ్ న్యూస్ -తాటిచెట్లపాలెం)
ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు , విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల అక్కయ్యపాలెం శ్రీనివాసనగర, మాధవదరలో సీతన్నగార్డెన్స్ లో పర్యటించి వ్యాధి వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇటీవలే గుజరాత్ నుండి వచ్చి క్వారెంటైన్ ఉన్న మత్యకారులను పరామర్శించేందుకు తాటిచెట్లపాలెం ఆశీర్వాద కల్యాణ మండపం, రైల్వే శ్రీనివాస కల్యాణ మండపం తదితర ప్రాంతాల్లో వారి యోగ క్షేమాలుఅడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు సిబ్బంది, వైస్సార్సీపీ అభ్యర్థులు,నాయకులు తదితరులు హాజరయ్యారు.