పాడేరుఐటీడీఏప్రాజెక్ట్అధికారిడీకేబాలాజీకిఎమ్మెల్యేభాగ్యలక్ష్మి దంపతులుఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
విశాఖ ఏజెన్సీలో మూడేళ్లుగా సబ్ కలెక్టర్గా విధుల్లో చేరి ఐటీడీఏ పీవోగా పదోన్నతి పొంది విశేష సేవలు అందించారని పాడేరు ఎమ్మెల్యే తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి తనదైన కృషి చేశారని కొనియాడారు. గిరిజన ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావించి విధులు నిర్వర్తించారని చెప్పారు. అనంతరం ఐటీడీఏ పీవో విధి నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.